Rajeev Chandrasekhar : క‌ర్ణాట‌క‌లో ఐ ఫోన్ల త‌యారీ కంపెనీ

ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి..సీఎం

Rajeev Chandrasekhar I Phone : కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్(Rajeev Chandrasekhar I Phone) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ప్ర‌పంచ దిగ్గ‌జ ఫోన్ల సంస్థ ఐ ఫోన్ త‌న ఫోన్ల‌ను త‌యారు చేసేందుకు గాను క‌ర్ణాట‌క‌లో 300 ఎక‌రాలలో ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

శుక్ర‌వారం ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఐ ఫోన్ల త‌యారీ వ‌ల్ల దాదాపు ల‌క్ష‌కు పైగా ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని తెలిపారు. ఆపిల్ ఫోన్ల త‌యారీలో ప్ర‌పంచ వ్యాప్తంగా రెండవ స్థానంలో ఉన్న ఫాక్స్ కాన్ 2021లో 206 బిలియ‌న్ల ఆదాయాన్ని న‌మోదు చేసింది.

త‌యారీ యూనిట్ ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై. ఈ మేర‌కు ఐఫోన్ల త‌యారీలో అగ్ర‌గామిగా ఉన్న ఫాక్స్ కాన్ కు బెంగ‌ళూరు శివార్ల‌లో ఉన్న భూమిని అంద‌జేశారు. 300 ఎక‌రాలు స‌ద‌రు కంపెనీకి ధార‌ద‌త్తం చేసింది రాష్ట్ర స‌ర్కార్. ఇది అతి పెద్ద త‌యారీ క్యాంప‌స్ గా మార‌బోతోంద‌ని చెప్పారు. చైర్మ‌న్ యంగ్ లియు నేతృత్వంలో ఫాక్స్ కాన్ మేనేజ్ మెంట్ కు చెందిన 17 మంది స‌భ్యుల ప్ర‌తినిధి బృందం శుక్ర‌వారం క్యాంప‌స్ ను సంద‌ర్శించింది.

గ్లోబ‌ల్ కంపెనీల‌కు బెంగ‌ళూరు ప్రాధాన్య‌త గ‌మ్య స్థానంగా ఉంద‌న్నారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్(Rajeev Chandrasekhar). పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో బెంగ‌ళూరు టాప్ లో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ఫాక్స్ కాన్ చైర్మ‌న్. ఇదిలా ఉండ‌గా ఫాక్స్ కాన్ కంపెనీ చైనా, ఇండియా, జ‌పాన్ , వియత్నాం, మ‌లేషియా , చెక్ రిప‌బ్లిక్ , అనేక దేశాల్లో త‌యారీ యూనిట్ల‌ను క‌లిగి ఉంది.

Also Read : బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ. 6 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!