Narottam Mishra : కాంగ్రెస్ కాదు ఇటాలియ‌న్ పార్టీ

మ‌ధ్య ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా

Narottam Mishra : మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజ్ ప‌టారియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ ఏశారు. కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పీఎంను చంపితేనే దేశం బాగు ప‌డుతంద‌న్నారు.

ఇవాళ రాజ్ ప‌టారియాను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే కోర్టు బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా తాను మోదీని తిట్ట‌లేద‌ని , కానీ కావాల‌ని త‌నను ఇరికించారంటూ పేర్కొన్నారు. తాను గాంధీ అనుచ‌రుడిన‌ని ఎలా హింస‌ను ప్రోత్స‌హిస్తానంటూ ప్ర‌శ్నించారు రాజ్ ప‌టారియా.

దీనిపై పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు మండి ప‌డుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నాయి. ఈ త‌రుణంలో మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి నరోత్త‌మ్ మిశ్రా స్పందించారు. మంగ‌ళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అది కాంగ్రెస్ పార్టీ కాద‌ని ఇటాలియ‌న్ పార్టీ అంటూ ఆరోపించారు.

వాళ్ల‌కు ఈ దేశం ప‌ట్ల , ప్ర‌జ‌ల ప‌ట్ల‌, సంస్కృతి ప‌ట్ల గౌర‌వం లేద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప‌వ‌ర్ కోల్పోయి నానా తంటాలు ప‌డుతోంద‌ని, అందుకే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారంటూ ఫైర్ అయ్యారు. నేరుగా బీజేపీని ఎదుర్కొనే ద‌మ్ము లేక ఇలాంటి చౌక‌బారు, నీచ‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు న‌రోత్త‌మ్ మిశ్రా(Narottam Mishra) .

ఇక‌నైనా రాజ్ ప‌టారియా తాను అన్న వ్యాఖ్య‌ల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే రాజ్ ప‌టారియా మాత్రం విక్ట‌రీ సింబ‌ల్ చూపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read : త‌గ్గేదే లే అంటున్న రాజా ప‌టేరియా

Leave A Reply

Your Email Id will not be published!