Ana konidela Pawan Kalyan : అనాధలతో అనా కొణిదెల క్రిస్మస్
సరుకులు అందజేసిన పవన్ భార్య
Ana konidela Pawan Kalyan : హైదరాబాద్ – జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భార్య అనా కొణిదెల సంచలనంగా మారారు. ఆమె ఇటీవలి కాలంలో బయటకు వచ్చారు. ఏపీలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ కు చెందిన మాజీ మంత్రులు సెటైర్ వేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ కు నిత్య పెళ్లి కొడుకు అంటూ పేర్కొన్నారు.
Ana konidela Pawan Kalyan Chirstmas with Orphans
ఇదిలా ఉండగా తాజాగా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అనా కొణిదెల పండుగను పురస్కరించుకుని అనాధ శరణాలయానికి చేరుకున్నారు. క్రిస్మస్ ఫెస్టివల్ సందర్బంగా అనాధ పిల్లలతో ముచ్చటించారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్ బాలాజీ స్వర్ణ పురి కాలనీలో ఉనన జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో సంభాషించారు. ఎలా చదువుకుంటున్నారని అనా కొణిదెల అడిగారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కేక్ ను అనాధ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువులను అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ భార్య అనా కొణిదెలను హోమ్ నిర్వాహకులు సత్కరించారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Bhatti Vikramarka Mallu : అలసత్వం వహిస్తే సహించం – భట్టి