Anand Mahindra Eagle : ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్

మోటివేష‌న్ వీడియో హ‌ల్ చ‌ల్

Anand Mahindra Eagle : భార‌తీయ వ్యాపార‌వేత్త‌ల‌లో ఆనంద్ మ‌హీంద్రా వెరీ వెరీ స్పెష‌ల్. ఆయ‌న అటు వ్యాపారంలోనే కాదు చ‌ద‌వ‌డంలో, రాయ‌డంలో, అభిప్రాయాల‌ను పంచుకోవ‌డంలో త‌న‌కు తానే సాటి. ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతూ ఉంటారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ధానంగా భార‌త దేశంలో ఏ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం క‌నిపించినా లేదా ఘ‌ట‌న చోటు చేసుకున్నా, స్పూర్తి దాయ‌కంగా ఉండే క‌థ‌లు, వ్య‌క్తులు, సంస్థ‌లు, క‌థ‌లు ఇలా ఏది ప్ర‌భావితం చేసినా వాటి గురించి ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకుంటారు.

తాజాగా ఆయ‌న ప్ర‌తి సోమ‌వారం రోజు మండే మోటివేష‌న్ పేరుతో వీడియోలు, ఆస‌క్తిక‌ర క‌థ‌లు షేర్ చేస్తారు. ఇవాళ కూడా అద్భుత‌మైన మోటివేష‌న్ క‌లిగిన వీడియోను షేర్ చేయ‌డంతో పెద్ద ఎత్తున లైక్ చేశారు నెటిజ‌న్లు. ఆయ‌న తాజాగా గ్ర‌ద్ద వీడియోను ఆనంద్ మ‌హీంద్రా ట్విట్ట‌ర్ లో షేర్ చేయ‌డం హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 10 ల‌క్ష‌ల మందికి పైగా లైక్ లు కొట్టారు. ఆనంద్ మ‌హీంద్రాకు(Anand Mahindra) జై కొట్టారు. జీవితం అంటే వ్యాపారం కాద‌ని అంత‌కంటే ఎక్కువ అని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ వ్యాపార‌వేత్త చేసే కామెంట్స్ , పంచుకునే ప్ర‌తి అభిప్రాయం క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతాయి. ఇది ఆయ‌న‌కు ఉన్న ప్ర‌త్యేక‌త‌. తాజాగా పంచుకున్న వీడియోలో గ్ర‌ద్ద‌కు మినీ కెమెరాను అమ‌ర్చారు. యూజ‌ర్ల‌కు పంచుతోంది.

చిత్తశుద్ది, ఏకాగ్ర‌త ప్ర‌తి ఒక్క‌రికీ ఎంత‌టి అవ‌స‌ర‌మో వెల్ల‌డిస్తూ పంచుకోవ‌డం మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read : ట్విట్ట‌ర్ ఫ్రెంచ్ ఆప‌రేష‌న్స్ హెడ్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!