ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’

త్యాగానికి మానవ రూపం పొట్టి శ్రీరాములు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. త్యాగానికి మానవ రూపం పొట్టి శ్రీరాములు అన పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. వారి విగ్రహం ఏర్పాటు తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనిపేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరజీవి త్యాగ శిల్పం వద్ద మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు.

అమరావతి ప్రాంతంలోని శాఖమూరులో కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటుచేస్తోంది. 6 నెలల రికార్డు సమయంలోనే ప్రాజెక్ట్ మొదట దశ పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు. జై వాసవీ మాత. ఒక మనిషి త్యాగం.. ఒక జాతి గౌరవం. ఒక దీక్ష.. ఒక రాష్ట్రం. అమరజీవి.. చిరంజీవి. మరణంలేని గొప్ప శక్తి. త్యాగానికి మానవ రూపం. ఆంధ్రప్రదేశ్ రూపంలో జీవించే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి రోజు 58 అడుగుల విగ్రహం రూపంలో మనకోసం మళ్లీ జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. డూండి రాకేష్ నా దగ్గరకు వచ్చి ఏం పేరు పెట్టాలనే దానిపై సలహా అడిగారు. అప్పుడు నా మనసులో తోచింది ఒక్కటే ఆ విగ్రహం చూస్తే ఆయన త్యాగం గుర్తుకు రావాలి. అందుకే ‘స్టాచ్యూ ఆప్ శాక్రిఫైస్’ అని పెడదాం అని చెప్పాను. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.

Leave A Reply

Your Email Id will not be published!