Pragya Thakur Row : ప్రగ్యా ఠాకూర్ పై మాజీ అధికారుల గుస్సా
ద్వేష పూరిత ప్రసంగం చేసినందుకు ఫైర్
Pragya Thakur Row : హిందువులు కత్తులకు పదును పెట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ పై నిప్పులు చెరిగారు 103 మంది మాజీ బ్యూరోక్రాట్లు. ఆమపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. ఇది పూర్తిగా దేశాన్ని విభజించేలా ఉందన్నారు.
ఇలాంటి మాటల వల్లే సమాజంలో కుల, మతాల ప్రస్తావన ఎక్కువగా వస్తోందన్నారు. ఇంకోసారి దుందుడుకు కామెంట్స్ చేయకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా అహంకారపూరితమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రగ్యా సింగ్ ఠాకూర్(Pragya Thakur Row) గత ఏడాది 2022 డిసెంబర్ 25న కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమెకు మద్దతుగా మధ్య ప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ ఎంపీ ఉమా భారతి నిలిచారు. ఈ మధ్య లవ్ జిహాద్ పేరుతో హిందువుల మహిళలు, యువతులు, బాలికలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక నుంచి పోలీసులు వచ్చే కంటే ముందు మన ఇళ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలని లేకుంటే ఇంట్లో కూరగాయల కోసం వాడే కత్తులకు పదును పెట్టాలని పిలుపునిచ్చారు ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్(Pragya Thakur Row).
కాగా ఎంపీపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. లవ్ జిహాద్ లో పాల్గొన్న వారికి సమాధానం చెప్పండి..మీ అమ్మాయిలను రక్షించండి , వారికి సరైన విలువలు నేర్పండి అంటూ పిలుపునిచ్చారు. స్పీకర్ కు లేఖ రాసిన వారిలో అనితా అగ్ని హోత్రి, సలావుద్దీన్ అహ్మద్ , ఎస్పీ ఆంబ్రోస్ ఉన్నారు. ఆమె పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రమాణాలను పాటించ లేదని ఆరోపించారు.
Also Read : బల్బీర్ సింగ్ కు మంత్రి పదవి