Remote Voting System : రిమోట్ ఓటింగ్ సిస్టంపై ఆగ్రహం
ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం
Remote Voting System : వలస ఓటర్ల కోసం రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎం)ని ప్రదర్శించేందుకు , చర్చించేందుకు భారత ఎన్నికల సంఘం (ఇసీఐ) సర్వ సభ్య సమావేశం నిర్వహించింది. అటువంటి వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. పార్టీల నుండి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంది ఎన్నికల సంఘం.
దీనికి హాజరైన పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎనిమిది జాతీయ, 40 గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీల అధ్యక్షుఉ, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎటువంటి ప్రదర్శనలు నిర్వహించడంలో సీఇసి పూర్తిగా విఫలమైంది. రాత పూర్వక అభిప్రాయాలను సమర్పించేందుకు జనవరి 31నుండి ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించింది.
గత నెలలో ఈసీఐ ఎన్నికల ప్రక్రియలో ఓటు వేయని ఓటర్లను చేర్చేందుకు ప్రతి ప్రయత్నం విస్తృత లక్ష్యాలు అనే అంశంపై అఖిలపక్ష సమమావేశానికి పిలుపునిచ్చింది. 80 మందికి పైగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒకరి సమర్పణలను ఓపికగా విన్నారు. అఖిలపక్ష చర్చకు పిలుపునిచ్చే ఈసీఐ చొరవను వారు మెచ్చుకున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి చర్చలు మరిన్ని జరగాలని సూచించారు. రిమోట్ ఓటింగ్(Remote Voting System) కోసం చట్ట పరమైన , పరిపాలనా పరమైన అంశాలు, లాజిస్టిక్ సవాళ్లకు సంబంధించిన అన్ని విషయాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో ఆర్వీఎం ప్రదర్శనను కోరాయి. మరికొందరు నాయకులు ఈ విషయాన్ని ముందుకు తీసుకు వెళ్లే ముందు దేశీయ వలసదారుల భావనను నిర్వచించాలని కోరుకున్నారు.
దేశీయ వలసదారుల కోసం చట్టంలో అవసరమైన మార్పులు, పాలనా పరమైన విధానాలు , ఓటింగ్ పద్దతి, ఆర్వీఎం సాంకేతికత వంటి వివిధ అంశాలపై జనవరి 31 లోగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.
Also Read : మోదీతో చర్చలకు సిద్ధం – పీఎం