Anil K Antony : బీజేపీలో చేరిన అనిల్ ఆంటోనీ
కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కొడుకు
Anil K Antony : కేరళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కె ఆంటోనీ(Anil K Antony) గురువారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. 2002 గుజరాత్ అల్లర్లు, పీఎం మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై వివాదం తలెత్తడంతో కేరళకు చెందిన కాంగ్రెస్ నేత అనిల్ ఆంటోనీ జనవరిలో పార్టీని వీడారు. ఈ మేరకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వి. మురళీధరన్ , ఆ పార్టీ కేరళ యూనిట్ చీఫ్ కే. సురేంద్రన్ కాంగ్రెస్ నేతను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తాము ఒక కుటుంబం కోసం పని చేస్తున్నామని నమ్ముతారు.
కానీ నేను దేశం కోసం పని చేస్తున్నానని నమ్ముతున్నానని బీజేపీలో చేరిన అనంతరం అనిల్ కె ఆంటోనీ చెప్పారు. బహుళ ధ్రువ ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామి స్థానంలో ఉంచడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్పష్టమైన దృష్టి ఉందని స్పష్టం చేశారు.
అనిల్ ఆంటోనీ పార్టీని వీడే ముందు కేరళలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ ను నడిపారు. ఆ తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చారు. పార్టీలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు.
Also Read : అవినీతి..బంధుప్రీతికి బీజేపీ దూరం