Anil Baijal : మనీష్ సిసోడియాపై అనిల్ బైజల్ సీరియస్
మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ షాకింగ్ కామెంట్స్
Anil Baijal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని మాజీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఆయన స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు.
కొత్త ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలు సమయంలో ఆప్ ప్రభుత్వం తీసుకున్న చట్ట విరుద్దమైన నిర్ణయాలను ఫైళ్లపై సవరించాలని అనేక సందర్భాలలో తాను ధ్వజమెత్తానని స్పష్టం చేశారు.
ఈ వాస్తవాలు ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని తెలిపారు అనిల్ బైజల్(Anil Baijal). ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎల్జీ నిర్ణయాలపై సందేహాలు లేవనెత్తడం, ఆరోపణలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
మనీష్ సిసోడియా తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. అవి తనను కాపాడు కోవడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు.
పూర్తిగా అవన్నీ అబద్దాలన్నీ, నిరాధారమైనవని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ లెఫ్టినెంట్ గవర్నర్. తాను పదవీ చేపట్టిన కాలంలో ఏనాడూ అవినీతి, అక్రమాలను ప్రోత్సహించ లేదని మరోసారి స్పష్టం చేశారు.
బేస్ లెస్ విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు మాజీ ఎల్జీ. ఇక తాను అనేక సందర్భాలలో ఢిల్లీలోని ఆప్ సర్కార్ తీసుకున్న చట్ట విరుద్దమైన నిర్ణయాలను ఫైళ్లపై సవరించాలని ధ్వజమెత్తారు.
మద్యం విక్రయాలను అనుమతించని విషయంలో , భూమికి సంబంధించిన చట్టాలను సమర్థించే రాజ్యాంగ బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించానని తెలిపారు.
Also Read : మోదీ ఆస్తుల విలువ రూ. 2.23 కోట్లు