Anil Deshmukh : మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య పొసగడం లేదు. నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొనసాగుతుంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే నవాబ్ మాలిక్ ను అరెస్ట్ చేసింది ఈడీ.
ఇంకో వైపు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే బావమరిదికి చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. ఇక నిరంతరం మాటల తూటాలు పేలుస్తూ వస్తున్న శివసేన ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ త తనయుడు, భార్యకు రూ. 11 కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.
దీనిపై నిప్పులు చెరిగారు సంజయ్ రౌత్. తాజాగా అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్(Anil Deshmukh) ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది.
అంతకు ముందు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పల్నాడేలను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఇదిలా ఉండగా బాంబే హైకోర్టు అనిల్ దేశ్ ముఖ్(Anil Deshmukh) పిటిషన్ ను స్వీకరించేందుకు తిరస్కరించింది.
సీబీఐ ప్రత్యేక కోర్టు పర్మిషన్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు దేశ్ ముఖ్. అనిల్ దేశ్ ముఖ్ కావాలనే కస్టడీని తప్పించు కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీబీఐ ఆరోపించింది.
జేజే ఆస్పత్రిలో కావాలని తనంతకు తాను చేరారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ గత ఏడాది అరెస్ట్ చేసింది. అప్పటి హోం శాఖ మంత్రిగా ఉన్న దేశ్ ముఖ్ పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ పోలీస్ కమిషనర్ పరం వీర్ సింగ్.
నెలకు రూ. 100 కోట్లు ఇవ్వాలంటూ టార్గెట్ పెట్టారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : భారత దేశం శాంతి పక్షం