Anil Kumar Lahoti : రైల్వే బోర్డు చైర్మన్ గా అనిల్ కుమార్
సిఇఓగా కూడా ఆయనేకే అప్పగింత
Anil Kumar Lahoti : భారత దేశంలో అత్యంత ఎక్కువ రవాణా వ్యవస్థ కలిగిన రైల్వే బోర్డుకు కీలకమైన పదవిగా భావించే చైర్మన్ గా అనిల్ కుమార్ లాహోటీ ఆదివారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అంతే కాదు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కూడా వ్యవహరిస్తారు. అనిల్ కుమార్ లాహోటి(Anil Kumar Lahoti) నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
దీనికి ముందు లాహోటి రైల్వే బోర్డులో సభ్యునిగా కూడా పని చేశారు. ఇదిలా ఉండగా అనిల్ కుమార్ లాహొటి ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ 1984 బ్యాచ్ కు చెందిన వారు. లెవల్ 17 కోసం ఇండియన్ రైల్వేస్ మేనేజ్ మెంట్ సర్వీస్ మొదటి ప్యానల్ లో ఎంప్యానెల్ చేయబడ్డారు.
అనిల్ కుమార్ లాహోటి(Anil Kumar Lahoti) మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో మాధవ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి బంగారు పతకం సాధించారు. ఇందులో ఆయన సివిల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు. యూనివర్శిటీ ఆఫ్ రూర్కీ (ఐఐటీ) నుండి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశారు.
రైల్వే శాఖ పరిధిలో ఎన్నో కీలకమైన పోస్టులను నిర్వహించారు. దాదాపు తన కెరీర్ లో 36 ఏళ్ల అనుభవం ఉంది అనిల్ కుమార్ లాహోటీకి. ఆయన ఇప్పటి వరకు సెంట్రల్ , నార్తర్న్ , నార్త్ సెంట్రల్ , వెస్ట్రన్ , వెస్ట్ సెంట్రల్ రైల్వేలలో , రైల్వే బోర్డులో వివిధ హోదాలలో పని చేశాడు.
ఇంతకు ముందు సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గా పనిచేశారు. చాలా నెలల పాటు పశ్చిమ రైల్వే జీఎంగా కూడా ఉన్నారు.
Also Read : గ్యాస్ వినియోగదారులకు ఝలక్