Anil Kumar Yadav : అమరావతి బూటకం అవినీతిమయం
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
Anil Kumar Yadav : తాడేపల్లి గూడెం – అమరావతి పేరుతో అవినీతి, అక్రమాలకు చంద్రబాబు నాయుడు పాల్పడ్డాడని ఈ విషయం ఐటీ నోటీసులతో వెల్లడైందని అన్నారు ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు 5 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Anil Kumar Yadav Comments on Chandrababu Naidu
చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబులను అరెస్ట్ చేయాలన్నారు. అప్పుడు కానీ అసలు విషయాలు బయటకు రావన్నారు. ఎల్లో మీడియా ఇప్పుడు ఏమని సమాధానం చెబుతుందని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్.
ఇందులో దత్త పుత్రుడికి సైతం ముడుపులు ముట్టాయని అందుకే నోరు మెదపడం లేదంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆరోపించారు. చంద్రబాబు పనై పోయిందన్నారు. ఇక శంకరగిరి మాన్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కేసులో చంద్రబాబును ఎవరూ కాపాడ లేరన్నారు. జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav). రూ. 118 కోట్ల ముడుపులు ముట్టాయని ఆరోపించారు. దీని కథేమిటో బయటకు రావాలన్నారు.
2020లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఇన్ కామ్ ట్యాక్స్ దాడులు జరిగాయి, ఈ దాడుల్లో పీఏ వద్ద రూ. 2 వేలకు పైగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు తేలిందని తెలిపారు అనిల్ కుమార్ యాదవ్.
Also Read : Minister KTR : హైదరాబాద్ లో నాఫ్కో భారీ ఇన్వెస్ట్