Anil Kumar Yadav : విజయవాడ – ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ లో ప్రధాన నిందితుడు, ముద్దాయి చంద్రబాబు నాయుడేనని పేర్కొన్నారు. పూర్తిగా పక్కా ఆధారాలతో ఉండడం వల్లనే బాబును అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు.
Anil Kumar Yadav Comments on Silk Scam case
45 ఏళ్ల రాజకీయ చరిత్రలో వ్యవస్థలను ఇంత కాలం మ్యానేజ్ చేసుకుంటూ వచ్చారని ఆరోపించారు అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav). కావాలని ఏపీ సీఎం జగన్ రెడ్డిని, తమపై ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నమోదు కాలేదన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న సమయంలో జీఎస్టీ, ఐటీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చిందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో కేసులు ఆయనపై నమోదై ఉన్నాయని చెప్పారు. వాటన్నింటి నుంచి బయట పడేందుకు స్టేలు తెచ్చుకున్నాడని ఆరోపించారు.
ప్రజలకు సంబంధించిన ధనాన్ని కొల్లగొట్టాడని, ఈ విషయం ఇవాల్టితో వెల్లడైందన్నారు. అందుకే ఎక్కడా బాబుకు మద్దతు లభించడం లేదన్నారు. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనను అరెస్ట్ చేయడం వల్ల తమకు వచ్చిన లాభం ఏమీ లేదని పేర్కొన్నారు అనిల్ కుమార్ యాదవ్.
చంద్రబాబు నాయుడు చేసిన పాపం పండిందని, ఏకంగా రూ. వందల కోట్లను చేతులు మార్చిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు.
Also Read : Atchannaidu : బాబు అరెస్ట్ పై అచ్చెన్న ఆవేదన
