Anjan Kumar Yadav : అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్
ముషీరాబాద్ లో దిగాలని ఒత్తిడి
Anjan Kumar Yadav : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముషీరాబాద్ నుండి తనను బరిలో నిలవాలని కోరుతున్నారని చెప్పారు. ప్రత్యేకించి పార్టీకి సంబంధించిన హైకమాండ్ ఒత్తిడి చేస్తోందని తెలిపారు.
Anjan Kumar Yadav Shocking Comments
ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్టీ పరంగా రాబోయే శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. డెడ్ లైన్ కూడా అయి పోయింది.
దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రూల్స్ ఏర్పాటు చేసింది. ఓసీలకు రూ. 50,000 , బీసీలకు రూ. 25,000 ఫీజుగా నిర్ణయించింది. ఇక బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ఎంపిక చేసింది.
తాజాగా అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. 119 సీట్లకు గాను ఇంకా పార్టీ పరంగా డిక్లేర్ చేయలేదు. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది సిట్టింగ్ లకే ఛాన్స్ ఇచ్చారు పార్టీ బాస్ , సీఎం కేసీఆర్.
దీంతో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ లపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. ఇప్పటి దాకా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా ఖరారు చేయలేదు అభ్యర్థులను.
Also Read : Kerala Glass Bridge : పొడవైన గాజు వంతెన ప్రారంభం