Annamalai : త‌మిళం ముఖ్యం హిందీని ఒప్పుకోం

త‌మిళ‌నాట అమిత్ షాకు చుక్కెదురు

Annamalai : ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన అమిత్ షాకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా నిర‌స‌న సెగ త‌గులుతోంది. ఇంగ్లీష్ త‌ప్ప హిందీని మాత్ర‌మే వాడాలంటూ ఆయ‌న ఇటీవ‌ల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

ఇక త‌మిళ‌నాడు అట్టుడుకుతోంది. బీజేపీకి చెందిన స్టేట్ చీఫ్ , మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ అన్నామ‌లై(Annamalai) డోంట్ కేర్ అన్నాడు. పార్టీ కంటే ప్రాంతం, ఆత్మాభిమానం, భాషాభిమానం ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న‌తో పాటు త‌మిళ‌నాడులో బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న అన్నాడీఎంకే సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌ధానంగా బీజేపీ చీఫ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం ఆ పార్టీలో క‌ల‌క‌లం రేగింది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాము భార‌తీయుల‌మ‌ని నిరూపించు కునేందుకు హిందీ నేర్చు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు.

ఇంగ్లీష్ కు హిందీ ప్ర‌త్యామ్నాయం కావ‌చ్చ‌ని, దేశంలో అధికార భాష‌గా హిందీ ఉండ‌వ‌చ్చంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

త‌మిళ‌నాడుపై హిందీని రుద్ద‌డాన్ని తాము అంగీక‌రించ బోమ‌న్నాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒప్పుకోమ‌న్నాడు అన్నామ‌లై. ప్ర‌ధాని మోదీ కూడా ప‌లు భాష‌ల‌ను నేర్చుకోవాల‌ని అంటున్నార‌ని కానీ హిందీనే నేర్చు కోమ‌ని ఎక్క‌డా చెప్ప‌లేద‌న్నాడు.

ఏ భాష‌ను ద్వేషించాల్సిన అవ‌స‌రం లేదు. కానీ త‌మిళం స్థానంలో ఏదైనా భాష‌ను వాడ‌డం త‌ప్పు లేద‌న్నాడు కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణ‌న్. సంస్కృతం కంటే అత్యంత ప్రాచీన‌మైన భాష త‌మిళ‌మ‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యాన్ని ప్ర‌ధాని కూడా ఒప్పుకున్నార‌ని తెలిపారు. రెహ‌మాన్ చేసిన కామెంట్స్ ను అన్నామ‌లై స్వాగ‌తించారు.

Also Read : అమిత్ షా హిందీ వాదం అన్నామ‌లై ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!