Revanth Reddy : ‘ధరణి’ కోసం మరో సాయుధ పోరాటం
కేసీఆర్ సర్కార్ పై రేవంత్ రెడ్డి ఫైర్
Revanth Reddy : తమ భూములు తామేవని నిరూపించు కునేందుకు మరోసారి రైతులు సాయుధ పోరాటానికి దిగాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ సమస్యలపై రచ్చబండ కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొని ప్రసంగించారు.
భూమి మీద హక్కు కోసం మా భూమి మాదే అని నిరూపించు కునేందుకు తెలంగాణలో రైతులు, బాధితులు, సామాన్యులు పోరాడేలా సీఎం కేసీఆర్ చేశాడని మండిపడ్డారు.
సొంత భూమిపై పేదోళ్లకు హక్కు లేకుండా కేవలం కొంత మంది పెట్టుబడిదారులకు వరంలా ధరణి మారిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఈరోజు వరకు ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియడం లేదన్నారు.
మొత్తం వ్యవస్థను సర్వ నాశనం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో కన్నీళ్లు తప్ప పన్నీరు అందడం లేదన్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన ధరణి వల్ల ఫాయిదా లేకుండా పోయింద్నారు టీపీసీసీ చీఫ్.
ఆదాయంపై ఉన్నంత మోజు ధరణి సమస్యల పరిష్కరించడంపై పెట్టడం లేదని మండిపడ్డారు. ప్రతిక్షణం ఐటీ జపం చేస్తున్న ప్రభుత్వం ఎందుకు ఈ ధరణిని పరిష్కరించ లేక పోతోందని ప్రశ్నించారు.
గ్రామాలలో ఇప్పటి దాకా సరిహద్దులు ఏర్పాటు చేయలేదు ఎందుకని నిలదీశారు ప్రభుత్వాన్ని. పూర్తిగా రెవిన్యూ వ్యవస్థ అవినీతికి కేరాఫ్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
ఇప్పటి వరకు ప్రభుత్్వానికి సంబంధించిన భూములు ఎవరి వద్ద ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : ఏరో స్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్