Kashmiri Pandit Shot Dead : మరో కాశ్మీరీ పండిట్ కాల్చివేత
ఉగ్రవాదుల ఘాతుకం
Kashmiri Pandit Shot Dead : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. ఇప్పటికే పలు దాడులకు తెగబడిన వీరు శనివారం మరో కాశ్మీరీ పండిట్ ను పొట్టన పెట్టుకున్నారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని చౌదరి గుండ్ ప్రాంతంలో పూరన్ క్రిషన్ భట్ పై కాల్పులకు తెగబడ్డారు. ఘటనా స్థలాన్ని చుట్టుముట్టారు , ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత బలగాలు జల్లెడ్ పడుతున్నాయి.
గత కొంత కాలంగా జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని హత్యకు పాల్పడ్డారు. ఇదే సమయంలో ఇవాళ పోషియాన్ జిల్లాలో కాశ్మీర్ పండిట్ ను కాల్చి(Kashmiri Pandit Shot Dead) చంపారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. పూరన్ క్రిషన్ భట్ పై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే షాపియాన్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ భట్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. క్రిషన్ భట్ కు ఇద్దరు పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్నారు. ఒకరు 7వ తరగతి చదివే అమ్మాయి, మరొకరు 5వ తరగతి చదువుతున్న అబ్బాయి. అతను ఇంటి నుండి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడేవాడని స్థానికులు తెలిపారు.
ఇదిలా ఉండగా గత ఆగస్టు 16న షోపియాన్ జిల్లాలోని యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ కాల్పుల్లో అతడి సోదరుడు కూడా గాయపడ్డాడు. బాధితుడిని సునీల్ కుమార్ గా గుర్తించారు. సోదరుడు పింటూ కుమార్ కు గాయాలయ్యాయి.
తిరంగా ర్యాలీలో ప్రజలను పాల్గొనాలని ప్రోత్సహించినందుకు పండిట్ సోదరులను లక్ష్యంగా చేసుకున్నామని ఉగ్రవాదులు ప్రకటించారు.
Also Read : పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన దేశం