Another Leo Pard : తిరుమలలో చిక్కిన మరో చిరుత
వరుసగా ఇది ఆరో చిరుత
Another Leo Pard : తిరుమల – ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుమలలో రోజు రోజుకు భక్తులు నడక దారిలో వెళ్లాలంటే జడుసుకుంటున్నారు. ఇప్పటికే క్రూర మృగాలు పెద్ద ఎత్తున సంచరిస్తున్నాయి. ఇప్పటికే ఓ చిరుత చిన్నారిని పొట్టన పెట్టుకుంది. మరో చిరుత దాడి చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతను మరింత పెంచింది.
Another Leo Pard Found
ఇప్పటి వరకు తిరుమల అడవిలో 5 చిరుతలు చిక్కాయి. తాజాగా ఆరో చిరుత బోనులో చిక్కింది. లక్ష్మీ నరసింహ ఆలయం 2,850వ మెట్టు వద్ద ట్రాప్ బోనులోకి వచ్చి చిరుత చిక్కుకుంది. ఈ చిక్కిన చిరుతతో ఇప్పటి దాకా సంఖ్య ఆరుకు చేరింది.
ఇక టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల భద్రతకు సంబంధించి సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు క్రూర మృగాల నుండి తమను తాము రక్షించు కునేందుకు గాను అటవీ శాఖ సహకారంతో చేతి కర్రలను పంపిణీ చేస్తోంది. కింద అలిపిరి మెట్ల మార్గంలో , శ్రీవారి మెట్ల వద్ద నుంచి కాలి నడకన బయలు దేరే భక్తులకు ఈ కర్రలను అందజేస్తుంది టీటీడీ.
వీటిని పైకి చేరుకున్న తర్వాత చేతి కర్రలను తీసుకుంటుంది. భక్తులను ఒక్కరొక్కరిని కాకుండా గుంపులు గుంపులుగా పంపిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీని వల్ల క్రూర మృగాల నుంచి రక్షించుకునేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు.
Also Read : Nawaz Sharif : పాకిస్తాన్ అడుక్కుంటోంది – షరీఫ్