Ajit Doval Blinken : అజిత్ దోవల్ తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ
వ్యూహాత్మక సంబంధాలపై చర్చ
Ajit Doval Blinken : భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో భేటీ అయ్యారు. భారత అమెరికా సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. యుఎస్ పర్యటనలో ఉన్న దోవల్ ప్రధానంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్ రష్యాతోను ఇటు యుఎస్ తోను సమానంగా సంబంధాలను నెరుపుతూ వస్తోంది. కీలకమైన అంశాలపై తాము చర్చించడం జరిగిందని చెప్పారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.
విస్తృత శ్రేణి ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నామని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చర్చించారు. ఇజ్రాయెల్ , ఈజిప్ట్ సహా మధ్య ప్రాచ్య పర్యటన ముగించుకుని వచ్చారు ఆంటోనీ బ్లింకెన్. ఆ వెంటనే ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో( Ajit Doval Blinken) సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం భారత్ జీ20 గ్రూప్ కు నాయకత్వం వహిస్తోంది. ఇందులో అమెరికా భాగస్వామిగా ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు యుఎస్ భారత దేశంతో సహకారాన్ని విస్తరించే పనిలో ఉందన్నారు ఆంటోనీ బ్లింకెన్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అజిత్ దోవల్ అమెరికా టూర్ లో భాగంగా కీలకమైన ప్రముఖ అధికారులతో వరుసగా భేటీ అవుతూ వచ్చారు. జేక్ సుల్లివాన్ ను కూడా కలిశారు. భారత్ , యుఎస్ దేశాల మధ్య టెక్నాలజీ, సెక్యూరిటీ పై అనుబంధం కలిగి ఉండాలని ఒప్పందం చేసుకున్నాయి. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
Also Read : ప్రధాని మోదీకి జోసెఫ్ బైడెన్ ఆహ్వానం