Anudeep Durishetty KCR : పిన్న వయసులో నగరానికి కలెక్టర్
అనుదీప్ దురిశెట్టి 2018వ బ్యాచ్
Anudeep Durishetty KCR : హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఐఏఎస్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి మర్యాద పూర్వకంగా బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. డైనమిక్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. విచిత్రం ఏమిటంటే అత్యంత చిన్న వయసులో కలెక్టర్ గా భాగ్య నగరానికి నియమితులు కావడం విస్తు పోయేలా చేసింది. అనుదీప్ దురిశెట్టి 2018వ బ్యాచ్ కు చెందిన ఆఫీసర్ .
గతంలో ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ లో మాజీ అసిస్టెంట్ కమిషనర్ గా పని చేశారు. అంతకు ముందు ప్రత్యాక ఐటీ కంపెనీ గూగుల్ లో కూడా జాబ్ చేశారు. హానివెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్ లో ఇంటర్న్ గా ఉన్నారు. అనుదీప్ దురిశెట్టి(Anudeep Durishetty) బిట్స్ పిలానీలో ఎలక్ట్రానిక్స్ , ఇన్ స్ట్రుమెంటేషన్ చదివారు. ఆయన స్వస్థలం మెట్ పల్లి.
తెలంగాణ ప్రభుత్వం అనుదీప్ దురిశెట్టిని ఏరికోరి హైదరాబాద్ కు ఎంచుకుంది. యుపీఎస్సీ పరీక్షలో టాపర్ గా నిలిచారు. తనపేరెంట్స్ తో కలిసి సీఎంను కలిశారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలోని యువకులకు అనుదీప్ రోల్ మాడల్ అని కొనియాడారు సీఎం కేసీఆర్. కేవలం 5 ఏళ్ల సర్వీసు మాత్రమే కలిగిన దురిశెట్టి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కలెక్టర్ గా నియమించడం చర్చకు దారి తీసేలా చేసింది.
Also Read : KC Venugopal : మణిపూర్ పై మోదీ మౌనమేల