Anurag Thakur : భారత్ పై దుష్ప్రచారం ఒప్పుకోం – ఠాకూర్
న్యూయార్క్ టైమ్స్ కథనంపై ఫైర్
Anurag Thakur NYT Article : కేంద్ర సమాచార , క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనం గురించి స్పందించారు. భారతీయులు అనుమతించబోరని పేర్కొన్నారు. కాశ్మీర్ లో సమాచార ప్రవాహంపై ఆరోపించిన ఆరోపణలపై యుఎస్ ఆధారిత వార్తా పత్రిక ఒక అభిప్రాయాన్ని ప్రచురించింది. అనురాగ్ ఠాకూర్(Anurag Thakur NYT Article) తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వాటిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ, ఇతర ప్రాథమిక హక్కుల వలె పవిత్రమైనదని స్పష్టం చేశారు. కశ్మీర్ లో పత్రికా స్వేచ్ఛపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన అభిప్రాయం పూర్తిగా కల్పితమని కొట్టి పారేశారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పనిగట్టుకుని అబద్దాలను ప్రచారం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ఇవాళ యావత్ ప్రపంచం భారత దేశం వైపు చూస్తోందని కానీ సదరు పత్రిక కు కన్పించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో స్పూర్తి దాయకమైన దేశంగా ముందుకు వెళుతోందని చెప్పారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). ప్రత్యేకంగా భారత దేశం , దాని ప్రజాస్వామ్య సంస్థల గురించి తప్పుడు ప్రచారం చేసేందుకే న్యూయార్క్ టైమ్స్ ఇలా చేసిందటూ ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి.
ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ గురించి అసత్యాలను ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని సూచించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. విదేశీ మీడియాపై సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : డిజిటల్ ఇండియా బిల్లుపై ఫోకస్