Anurag Thakur : దీదీ పాలనలో బెంగాల్ కాలి పోతోంది
కేంద్ర క్రీడా, సమాచార మంత్రి ఠాకూర్
Anurag Thakur : కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన కామెంట్స్ చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. పాలన పక్కదారి పట్టిందని మండిపడ్డారు. సోమవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు అనురాగ్ ఠాకూర్.
గతంలో బెంగాల్ అంటే ఎనలేని గుర్తింపు ఉండేదన్నారు. ఎంతో కాపాడుకుంటూ వస్తున్న రాష్ట్ర సంస్కృతి, నాగరికత, పరువు , మర్యాదలను పక్కదారి పట్టించేలా చేసిన ఘనత టీఎంసీ పార్టీకి, సీఎం మమతా బెనర్జీకే దక్కుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు . మొత్తంగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మమత పాలనలో ఏముంది చెప్పుకోవడానికి అంటూ నిలదీశారు. ఎక్కడ చూసినా హింస, అవినీతి, అక్రమాలు, కేసులు, దాడులు తప్ప ఇంకేమీ లేవంటూ మండిపడ్డారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). అన్యాయం అనేది సర్వ సాధారణంగా మారిందన్నారు.
గత కొంత కాలం నుంచీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ లో కొలువు తీరిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
Also Read : Scoop Web Series : స్కూప్ వెబ్ సీరీస్ సూపర్