Droupadi Murmu : ఈ దేశంలో ఎవరైనా రాష్ట్రపతి కావచ్చు
కలలు కనడం సాకారం చేసుకోవడం సాధ్యమే
Droupadi Murmu : ఈ దేశంలో ఎవరైనా కలలు కనొచ్చు. వాటిని సాకారం చేసుకునే ఒకే ఒక్క అవకాశం ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక్క భారత దేశంలోనే సాధ్యమవుతుందన్నారు నూతన రాష్ట్రపతిగా కొలువు తీరిన ద్రౌపది ముర్ము(Droupadi Murmu).
అత్యున్నతమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్నది ఈ దేశమని కొనియాడారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి శ్రీరామరక్ష అని అది లేక పోయి ఉండి ఉంటే తాను ఇలా మాట్లాడి ఉండేదానని కాదని పేర్కొన్నారు.
భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ఉద్వేగ భరితంగా ప్రసంగించారు.
ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. భర్తను, పిల్లలను, చివరకు తల్లిని కూడా కోల్పోయా. కానీ ఏనాడూ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదన్నారు.
ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. ప్రతి ఒక్కరు చదువు కోవాలని పిలుపునిచ్చారు. ఈ దేశ భవిష్యత్తు యువతీ యువకులపై ఉందని దానిని గుర్తించి ముందుకు నడవాలని కోరారు రాష్ట్రపతి.
అత్యున్నతమైన రాజ్యాంగ పదవిని తనకు కట్టబెట్టినందుకు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో తాను రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు ద్రౌపది ముర్ము(Droupadi Murmu).
మా ఊరులో 10వ తరగతి చదువుకున్న మొదటి బాలికను తానేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో పేదలు కలలు కనొచ్చు ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చన్నారు.
Also Read : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం
DROUPADI MURMU TAKES OATH TO BECOME THE 15TH PRESIDENT OF INDIA
"Thank the people of India & the MP's, MLa's for putting faith in me,": Madam President #DroupadiMurmu. 🇮🇳 pic.twitter.com/7nx6WTXgzP
— Mirror Now (@MirrorNow) July 25, 2022