AP ACB Court : బాబుకు ఏసీబీ కోర్టు బిగ్ షాక్
హౌస్ రిమాండ్ కుదరదు
AP ACB Court : విజయవాడ – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన ప్రాణానికి ముప్పు ఉందని, బాబుకు ఇప్పుడు 73 ఏళ్లు అని, మానవతా దృక్ఫథంతో ఆయనకు గృహ నిర్బంధంలో ఉంచేలా చూడాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో.
AP ACB Court Shock to Chandrababu
మంగళవారం ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కోలుకోలేని షాక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu). చట్టం ముందు అంతా సమానమేనని, మాజీ సీఎం అయినంత మాత్రాన ప్రత్యేకంగా చట్టం అంటూ ఉండదని జడ్జి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అంతే కాదు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో జుడిషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలన్న పిటిషన్ చెల్లదని కోర్టు కొట్టి వేసింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న బాబుకు, ఆయన కుటుంబీకులకు ఇది బిగ్ షాక్ అని చెప్పక తప్పదు.
బలమైన ఆధారాలు ఉన్నందు వల్ల బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది నిన్న జడ్జి బీఎస్వీ హిమ బిందు. బాబుపై ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా ఆమె వైరల్ గా మారారు దేశ వ్యాప్తంగా. ఎవరీ హిమ బిందు అంటూ వెతకడం మొదలు పెట్టారు.
Also Read : Sonia Gandhi : 17న సోనియా గాంధీ రాక