AP ACB Court : విజయవాడ- ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కేసు విచారణ సందర్భంగా సంచలన తీర్పు చెప్పారు ఏసీబీ కోర్టు జడ్జి హిమ బిందు. ఆమె రాత్రి 7 గంటలకు తుది తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు లాయర్ లూథ్రా చంద్రబాబు నాయుడు తరపున వాదించారు. ఏపీ సీఐడీ తరపున ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదించారు.
AP ACB Court Comment
ఇరువురి మధ్య వాదనలు సుదీర్ఘంగా సాగాయి. రెండు సార్లు వాయిదా పడింది. చివరి దాకా చంద్రబాబు నాయుడుకు బెయిల్ దొరుకుతుందని అంతా భావించారు. తెలుగు రాష్ట్రాలంలో ఈ తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురు చూశారు.
కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఆయన పరివారం, టీడీపీ శ్రేణులకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు జడ్జి హిమ బిందు. ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆ వెంటనే తుది తీర్పు వెలువరిస్తూ సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడుకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయన మాజీ సీఎం అని, ప్రత్యేక గది కేటాయించాలని , స్పెషల్ ట్రీట్మెంట్ చేయాలని దాఖలైన పిటిషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత విషయంలో సాధారణ జైలుకే తరలించడం జరిగిందని , చట్టం ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు జడ్జి.
Also Read : Siddarth Luthra : బాబు ఆశలపై నీళ్లు చల్లిన లాయర్
