AP Additional AG : రామోజీరావును కోర్టులో నిలబెడతాం
ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్
AP Additional AG : ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనాడు ,మార్గదర్శి గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావుపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తున్నారంటూ ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛ అంటూ ఇతరుల స్వేచ్ఛను హరించే హక్కు రామోజీరావుకు లేదన్నారు. గుంటూరు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశామని స్పష్టం చేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
ఈ కేసులో రామోజీరావు, ఆయన కుమారుడు కిరణ్ , కూతురు శైలజా కిరణ్ , ఏపీ , తెలంగాణ ఈనాడు ఎడిటర్ , బ్యూరో చీఫ్ లను బాధ్యులుగా చేర్చినట్లు పేర్కొన్నారు. పరువు నష్టం దావాపై వివరాలు వెల్లడించారు. చట్టానికి వ్యతిరేకంగా అక్రమ వ్యాపారం చేస్తున్న మార్గదర్శి చిట్స్ సంస్థపై సీఐడీ విచారించిందని, దీనిపై తప్పుడు రాతలు రాశారంటూ పేర్కొన్నారు.
ఈనాడు తప్పు రాతలపై రామోజీరావు(Ramoji Rao)ను తప్పకుండా కోర్టులో నిలబడెతామని ఏపీ అడిషనల్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మార్గదర్శి చిట్స్ సంస్థ రాష్ట్రంలోనే కాక ఇతర ప్రాంతాల్లో అక్రమ వ్యాపారం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని రూఢీ చేసుకున్న సీఐడీ దర్యాప్తు చేసిందన్నారు. ఈనాడు, ఈటీవీ ద్వారా తప్పుడు వార్తలు రాస్తూ విషం చిమ్మిందని ఆరోపించారు.
ముఖ్యంగా మార్గదర్శిపై విచారణ చేసే వారిని భయభ్రాంతులకు గురి చేసే రీతిలో వారి రాతలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.సీఐడీని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విధంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.
Also Read : Congress Comment : హామీల వర్షం దక్కనుందా అధికారం
