Cyclone Asani : వాతావరణ కేంద్రం హెచ్చరించిన విధంగానే బంగాళాఖాతంలో అసని తుపాను బలహీన పడింది. దీంతో ఈ తుపాను ఎఫెక్ట్ ఎక్కువగా ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై పడనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల సీఎంలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా ఏపీలో కోస్తాంధ్రాలో ఎక్కువగా వర్షాలు కురవనున్నాయి. వాయుగుండంగా మారనుంది.
దిశ మార్చుకున్న తుపారు ఈశాన్యం వైపు కదులుతున్నట్లు గుర్తించింది వాతావరణ శాఖ. తీరం వెంట గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
గరిష్టంగా ఆ గాలుల తీవ్రత 110 కిలోమీటర్లు మించి గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను(Cyclone Asani) తీవ్రతను గుర్తించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూడాలని, చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు.
ప్రధానంగా అసని తుపాను ప్రభావం విశాఖ పట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ ఎత్తున వర్షాలు కురవనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ టీంలను మోహరించారు. అసని తుపాను(Cyclone Asani) ఎఫెక్ట్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేసింది.
అదే విధంగా వాతావారణంలో పెను మార్పు చోటు చేసుకోవడంతో విమాన సర్వీసులపై పడింది. గన్న వరం నుంచి రాక పోకలు సాగించే ఫ్లైట్స ను నిషేధించారు.
తుపాను కారణంగా అవసరమైతే తప్ప తీర ప్రాంతాల వద్దకు వెళ్ల కూడదని మత్స్య కారులకు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : అసని తుపాను ఎఫెక్ట్ వైజాగ్ పోర్ట్ క్లోజ్