AP Cabinet Resign : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం మూకుమ్మడిగా రాజీనామా (AP Cabinet Resign)చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 మంది మంత్రులు తమ పదవులకు గుడ్ బై చెప్పారు.
ఈనెల 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో వీరంతా రాజీనామా చేయడం కలకలం రేపింది. కొత్త వారిని తీసుకున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు ఏపీ సీఎం జగన్ రెడ్డి.
చివరి కేబినెట్ భేటీ సందర్భంగా కొత్తపేట, పులివెందుల రెవిన్యూ డివిజన్లకు ఏపీ కేబినెట్(AP Cabinet Resign) ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ పూర్తి చేసినందుకు గాను సీఎం ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ను అభినందించారు.
రాజీనామాలు చేసిన మంత్రులకు సంబంధించి పత్రాలను గవర్నర్ కు ఏపీ సర్కార్ సమర్పించనుంది. అనంతరం ఈనెల 10వ సాయంత్రం కొత్త కేబినెట్ లో ఎవరెవరిని తీసుకుంటారనే దాని పై ఉత్కంఠ నెలకొంది.
వాటన్నింటికి తెర దించుతూ ఇప్పటికే సీఎం జగన్ లిస్టు తయారు చేశారని సమాచారం. ఇదిలా ఉండగా కేబినెట్ భేటీ అనంతరం, రాజీనామా చేశాక కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
తాము రాజీనామా చేశామని , అయితే ముగ్గురు లేదా నలుగురికి ఛాన్స్ ఇవ్వవచ్చని తెలిపారు. తమకు ప్రోటోకాల్ విషయంలో అభ్యంతరం లేదన్నారు కొడాలి నాని.
ప్రస్తుతం రాజీనామా సమర్పించిన మంత్రుల స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నారు. మంత్రులుగా గుడ్ బై చెప్పిన వారికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు.
Also Read : మేలో గడప గడపకు ఎమ్మెల్యే