AP CID Chief : చంద్ర‌బాబే సూత్ర‌ధారి – సంజ‌య్

స్కిల్ స్కామ్ లో ఏపీ సీఐడీ

AP CID Chief : విజ‌యవాడ – ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అస‌లైన దోషి, సూత్ర‌ధారి మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజ‌య్(AP CID Chief). ఆయ‌న మ‌రోసారి కేసు పూర్వ ప‌రాల‌ను వెల్ల‌డించారు.

సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ఏర్పాటు కోసం ఆనాడు బాబు నేతృత్వంలోని స‌ర్కార్ ఏకంగా రూ. 371 కోట్లు రిలీజ్ చేసింద‌న్నారు. వీటిని న‌కిలీ ఇన్ వాయిస్ లు సృష్టించార‌ని, ఎవ‌రికీ తెలియ‌కుండా, అనుమానం రాకుండా నిధుల‌ను దారి మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేశార‌ని స్ప‌ష్టం చేశారు .

AP CID Chief Comments Viral

షెల్ కంపెనీల ద్వారా సొమ్మును పంచుకున్నార‌ని ఆరోపించారు. ఏపీ సివిల్ వ‌ర్క్స్ కోడ్, ఏపీ ఫైనాన్షియ‌ల్ కోడ్ ల‌ను ఉల్లంఘించార‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఉన్న‌తాధికారుల అభ్యంత‌రాల‌ను సైతం ప‌ట్టించు కోలేద‌న్నారు.

చాలా వ్య‌త్యాసాలు ఉన్నాయ‌ని తెలిపారు. 13 వేర్వేరు ప్ర‌దేశాల‌లో సంత‌కాలు చేసిన‌ట్లు త‌మ విచార‌ణ‌లో వెల్ల‌డైంద‌న్నారు ఏపీ సీఐడీ. ఎలాంటి అర్హ‌త‌, అనుభ‌వం లేని గంటా సుబ్బారావు అనే వ్య‌క్తిని నియ‌మించార‌ని తెలిపారు. సీఎం వ‌ద్ద‌కు వెళ్లే ఛాన్స్ కూడా ఇచ్చార‌ని చెప్పారు.

ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేయాల‌నే దురుద్దేశంతోనే ఇదంతా జ‌రిగిందంటూ ఆరోపించారు ఏపీ సీఐడీ చీఫ్‌.

Also Read : RK Roja Selvamani : టీడీపీకి పార్టీని తాకట్టు పెట్టిన ప‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!