AP CID Chief : నారా లోకేష్ అరెస్ట్ తప్పదు
ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్
AP CID Chief : విజయవాడ – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కు సంబంధించి సంచలన ప్రకటన చేశారు ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పక్కా ఆధారాలతో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేశామని చెప్పారు. ఇదే సమయంలో ఫైబర్ నెట్ , ఇన్నర్ రోడ్డు కు సంబంధించి కూడా నారా లోకేష్ ను విచారించాల్సి ఉందన్నారు.
AP CID Chief Said We have Evidence
ఇందులో భాగంగా ఆయనను కూడా అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు ఎన్. సంజయ్(N Sanjay). ఇక స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు ప్రధాన కుట్రదారుడని పేర్కొన్నారు. పక్కా ఫ్రూఫ్స్ ఉన్నాయని చెప్పారు . లోకేష్ ను కూడా అదుపులోకి తీసుకుంటామని అన్నారు.
ఇది అత్యంత లోతైన ఆర్థిక నేరమన్నారు. చంద్రబాబు నాయుడు కనుసన్నలలోనే జరిగిందని చెప్పారు. ఈ విచారణలో ఆయన ముఖ్య పాత్రధారిగా ఉన్నారని పేర్కొన్నారు. అందు వల్లనే కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు ఏపీ సీఐడీ చీఫ్ .
ప్రతి దానిలోనూ చంద్రబాబు నాయుడి ప్రమేయం ఉందని తేలిందన్నారు. మరిన్ని స్కాంలు వెలుగులోకి రావాలంటే ఆయనను అరెస్ట్ చేయక తప్ప లేదన్నారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తామంటూ తిరిగి ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ లో బాబు పేరు ఉందని చెప్పారు.
Also Read : AP CID Chief : స్కామ్ లో నారా లోకేష్ కు పాత్ర – సీఐడీ