AP CID Chief N Sanjay : పక్కా ఫ్రూఫ్స్ తో బాబు అరెస్ట్
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
AP CID Chief N Sanjay : విజయవాడ – ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కు సంబంధించి శనివారం మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలియ చేశారు. పక్కా ఆధారాలు ఉన్నందు వల్లనే తాము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
AP CID Chief N Sanjay Comments Viral
ఇందులో కుట్ర పూరిత కోణం దాగి ఉందన్నారు. ఆయన గతంలో ఏపీ సీఎంగా పని చేసిన కాలంలో ఈ స్కీం స్కాం చోటు చేసుకుందని ఆరోపించారు. షెల్ కంపెనీలకు రూ. 371 కోట్లు హవాలా రూపంలో చేతులు మారిందని స్పష్టం చేశారు.
బదిలీ చేసిన కేసులో చంద్రబాబు నాయుడు ప్రధాన కుట్ర దారుడని పేర్కొన్నారు ఎన్. సంజయ్(AP CID Chief N Sanjay). నిధులన్నీ వికాస్ అనే వ్యక్తి ద్వారా చేతులు మారాయని తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు దారి మళ్లింపు విషయంలో కూడా నారా లోకేష్ ను కూడా ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు సీఐడీ చీప్.
వైద్య పరీక్షలు చేపట్టామని, ఆ తర్వాతే విజయవాడకు చంద్రబాబును తరలిస్తున్నామని చెప్పారు. ముందుగా విమానంలో రావాలని కోరామని, కానీ బాబు ఒప్పు కోలేదన్నారు. ఎలాంటి కేబినెట్ ఆమోదం లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం లేదన్నారు.
Also Read : AP RTC Buses Bandh : బాబు అరెస్ట్ బస్సులు బంద్