AP CID Chief : స్కామ్ లో నారా లోకేష్ కు పాత్ర – సీఐడీ
ఫైబర్ నెట్ , ఇన్నర్ రింగ్ రోడ్డు
AP CID Chief : విజయవాడ – ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో ఇవాళ ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ లో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన పూర్తి వివరాలు పంచుకున్నారు.
AP CID Chief Shocking Comments
పక్కా ఆధారాలు ఉన్నందు వల్లనే చంద్రబాబును అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రూ. 371 కోట్ల స్కాం చోటు చేసుకుందన్నారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు హవాలా రూపంలో చేతులు మారాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు కు కూడా ఇందులో పాత్ర ఉందని చెప్పారు సీఐడీ చీఫ్ ఎన్ .సంజయ్.
ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఆయనను కూడా విచారించాల్సి ఉందన్నారు. దీంతో లోకేష్ ను కూడా అరెస్ట్ చేయక తప్పదన్నారు.
2021 నుంచే సీఐడీ దర్యాప్తు చేస్తోందన్నారు. విజయవాడకు చేరుకున్న తర్వాత చంద్రబాబు నాయుడును మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని చెప్పారు సీఐడీ చీఫ్ . రూ. 500 కోట్ల స్కాం జరిగిందన్నారు. ఏసీబీ కోర్టులో సాయంత్రం వరకు ప్రవేశ పెడతామన్నారు. చంద్రబాబు ప్రధాన లబ్దిదారుగా తేలిందన్నారు.
Also Read : AP CID Chief N Sanjay : పక్కా ఫ్రూఫ్స్ తో బాబు అరెస్ట్