AP CID : ఐఆర్ఆర్ కేసులో నారాయ‌ణ అల్లుడు

విచార‌ణ చేప‌ట్టిన ఏపీ సీఐడీ

AP CID : అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. బుధ‌వారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పునీత్‌ను సీఐడీ అధికారులు విచారించారు.

న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్ కేసులో ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా పునీత్‌కు సీఐడీ అధికారులు నోటీసులు పంపగా దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని కోర్టును కోరారు.

AP CID Investigation

అయితే పునీత్‌ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు మాత్ర‌మే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో స్వల్ప ఊరట లభించినట్లైంది నారాయ‌ణ(Narayana) అల్లుడుకు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు పునీత ఇవాళ‌ సీఐడీ ఎదుట హాజరయ్యారు.

మరోవైపు ఇదే కేసులో నోటీసులు అందుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రెండో రోజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

మ‌రో వైపు ఇదే కేసుతో పాటు ఫైబ‌ర్ నెట్, ఏపీ స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌కు కూడా నోటీసులు ఇచ్చింది.

Also Read : Kanakadurga Temple : దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి భారీ ఏర్పాట్లు

Leave A Reply

Your Email Id will not be published!