AP CID : అమరావతి – ఏపీ స్కిల్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి చంద్రబాబు 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
AP CID Comment about Chandrababu Bail
కంటి శస్త్ర చికిత్స కోసం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ సీఐడీ(CID) అభ్యంతరం తెలిపింది. ఆయన మాజీ సీఎం గా ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేస్తారని, ఈ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వ కూడదంటూ కోరింది. ఇదిలా ఉండగా నాలుగు వారాల పాటు ముందస్తు బెయిల్ గతంలో మంజూరు చేసింది కోర్టు. దీని గడువు నవంబర్ 28 వరకు ఉంది. ఇదిలా ఉండగా ఏపీ సీఐడీ ఏకంగా చంద్రబాబు నాయుడుపై ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇందులో ఏపీ స్కిల్ స్కామ్, ఏపీ సీఐడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డ్ ఎలైన్మెంట్ స్కామ్ కేసులు ఉన్నాయి.
Also Read : AP CM YS Jagan : మత్స్యకారులకు నష్ట పరిహారం