Chandrababu Naidu : 10 గంటలకు పైగా బాబు విచారణ
ఏపీ సీఐడీ ప్రశ్నల వర్షం
Chandrababu Naidu : కంచనపల్లి – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కు సంబంధించి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారంటూ ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. నంద్యాలలో నిన్న బాబును అదుపులోకి తీసుకున్న సీఐడీ భారీ భద్రత మధ్య తాడేపల్లి గూడెంలోని కంచనపల్లి సీఐడీ కార్యాలయానికి తీసుకు వచ్చింది.
Chandrababu Naidu Investigation
సాయంత్రం మొదలైన విచారణ కంటిన్యూగా అర్ధరాత్రి వరకు కొనసాగింది. దాదాపు 10 గంటలకు పైగా నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ ఉన్నతాధికారులు విచారించారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టు ఆధారంగా చంద్రబాబుకు 20 ప్రశ్నలు వేసింది. ఏ ఒక్క ప్రశ్నకు చంద్రబాబు స్పందించ లేదని సమాచారం.
తనకు తెలియదంటూ సమాధానం ఇచ్చారు. ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. తనను హింసించారంటూ వాపోయారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు నాయుడుకు మొత్తం తెలిసే ఈ స్కామ్ జరిగిందని ఏపీ సీఐడీ స్పష్టం చేసింది.
గతంలో అరెస్ట్ చేసిన వారికి ఎంత పాత్ర ఉందో అంతకంటే ఎక్కువగా మాజీ సీఎంకు ఉందని పేర్కొంది. విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు కావాలని సమాధానం ఇవ్వలేదని ఆరోపించింది. అర్ధరాత్రి విచారించిన అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read : Chandrababu Naidu : చంద్రబాబు సూత్రధారి..పాత్రధారి