Nara Lokesh : లోకేష్ అరెస్ట్ కు రంగం సిద్దం..?

ఎ14గా అమ‌రావతి ఇన్న‌ర్ రింగ్ కేసు

Nara Lokesh : అమ‌రావ‌తి – ఏపీ సీఐడీ చాప కింద నీరులా ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి నారా లోకేష్ ను ఎ14గా చేరుస్తూ మెమో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీంతో సీఐడీ ప‌క‌డ్బందీగా ఉచ్చు బిగించింది. ఇప్ప‌టికే ఏపీ స్కిల్ స్కాం కేసులో నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు.

Nara Lokesh May be Arrest

తాజాగా అమ‌రావ‌తి ఇన్న‌ర్ రోడ్డు నిర్మాణంలో స్కాం చోటు చేసుకుంద‌ని ఆరోపించింది. ఇదే స‌మ‌యంలో ప‌లువురిపై కేసు న‌మోదు చేసింది. భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొంది ఏపీ సీఐడీ.

ఇదిలా ఉండ‌గా ఇన్న‌ర్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసులో మాజీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తో పాటు మాజీ మంత్రి నారాయ‌ణ‌, లింగ‌మ‌నేని రాజేశ్, లింగ‌మ‌నేని వెంక‌ట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌజింగ్ లిమిటెడ్ కు చెందిన అంజ‌నీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్ , రామ‌కృష్ణ హౌసింగ్ సొసైటీతో పాటు ప‌లువురిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఏపీ సీఐడీ.

గ‌త కొన్ని రోజుల నుంచి ఏపీ సీఐడీ ఏపీ స్కిల్ స్కాంతో పాటు అమ‌రావ‌తి ఇన్న‌ర్ రోడ్డు ల‌కు సంబంధించి స్ఆకం చోటు చేసుకుంద‌ని స్ప‌ష్టం చేసింది. కొంత మందికి ల‌బ్ది చేకూర్చేలా చేశారంటూ ఆరోపించింది. అలైన్మెంట్ ను సైతం మార్చారంటూ పేర్కొంది.

Also Read : G Kishan Reddy : గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం అభినంద‌నీయం

 

Leave A Reply

Your Email Id will not be published!