AP CM Governor Congrats : ఇస్రో టీంకు జగన్..నజీర్ కంగ్రాట్స్
పీఎస్ఎల్వీ-సి56 రాకెట్ సక్సెస్
AP CM Governor Congrats : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట కేంద్రంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఆదివారం ఉదయం పీఎస్ఎల్వీ-సీ56 విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ను, శాస్త్రవేత్తలను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నీజర్(Governer AP).
AP CM Governor Congrats ISRO
ఇదిలా ఉండగా సక్సెస్ ఫుల్ గా నిర్ణీత కక్ష్య లోకి వెళ్లిందని ప్రకటించారు ఇస్రో చైర్మన్. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం కంగ్రాట్స్ తెలిపారు. కాగా సింగపూర్ కు చెందిన డీఎస్ఎస్ఆర్ ఉపగ్రహంతో పాటు ఆరు సహ ప్రయాణీకుల ఉపగ్రహాలను మోసుకెళ్లే పీఎస్ఎల్వీ-సీ56ను ప్రయోగించారు. ఇప్పటి వరకు ఇస్రో ఆధ్వర్యంలో 58 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇది ప్రత్యేకించి 17వది కావడం విశేషం.
ఇస్రో ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేయాలని ఆకాంక్షించారు సీఎం జగన్ , గవర్నర్ నజీర్. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవబోతోందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయోగాల గురించి విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఉందని పేర్కొన్నారు సీఎం. తమ ప్రభుత్వం విద్యాభివృద్దికి ప్రయారిటీ ఇస్తోందని స్పష్టం చేశారు.
Also Read : Dil Raju : ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తా