CM YS Jagan : విశాఖ నుంచే పాలన జనానికి ఆలంబన
స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
CM YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆయన పదే పదే విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని ఇప్పటికే వెల్లడించారు. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వచ్చే సెప్టెంబర్ నుంచి పూర్తిగా పాలన అంతా విశాఖ నుంచే కొనసాగుతుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
మూడు రాజధానులతో అన్ని జిల్లాలు అభివృద్ది పథంలో పయనిస్తాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు బురద చల్లడానికే పని చేస్తున్నాయని , వాళ్లకు రాష్ట్ర ప్రజలు పట్టరని ఎద్దేవా చేశారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ రెడ్డి(CM YS Jagan) పర్యటించారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం, నౌపడ వద్ద పోర్ట్ నిర్వాసితుల కాలనీకి శంకుస్థాపన చేశారు.
ఇక త్వరలోనే విశాఖలోనే తాను ఉంటానని, ఇందుకు సెప్టెంబర్ ముహూర్తం కూడా ఖరారైందని చెప్పారు సీఎం. దీని వల్ల పాలన మరింత వేగవంతంగా జరిగేందుకు వీలు కుదురుతుందని తెలిపారు. ఏపీలో ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు, అందరికీ ఆమోదయోగ్యమైన నగరం కేవలం విశాఖ మాత్రమేనని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు జగన్ రెడ్డి(CM YS Jagan).
Also Read : కబ్జాలు..ఫామ్ హౌస్ లు అబద్దం