#CMJagan : 40 నిమిషాల భేటీలో..నలుగుతున్న చర్చలు
ప్రధాని మోదీతో.. సీఎం జగన్ భేటీపై రకరకాల ఊహాగానాలు
CM Jagan : ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. అలాగే బీజేపీతో చేయి కలిపేందుకు..ఆయనకు అన్ని తలుపులూ తెరుచుకునే ఉన్నాయనేది ఒక నిజం. అయితే ఇక్కడ అవసరాలు అలాగే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిగా దించేయాలని..రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సామాజిక వర్గం, రెండు డబ్బు, మూడు అధికారం, నాలుగు బ్యూరోక్రసీ విధానాలు అంటే ప్రతిపక్షానికి సపోర్టు చేసే ప్రభుత్వ ఉద్యోగులు..ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్, టీడీపీలు మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలించాయి. అందువల్ల వారికి విశ్వాసపాత్రులైన వారే..ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు.
అందుకే ఈ ప్రభుత్వం వస్తే వారిని తీసేసి..వీరిని పెట్టుకోవడం, వీరు వస్తే వారిని తీసివేయడం ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకని వీళ్లందరూ కలిసి జగన్ ని డీగ్రేడ్ చేయడానికి పగలనకా,రేయనకా శ్రమిస్తూనే ఉన్నాయి. ఇది ఒక తలనొప్పి, న్యాయపోరాటం ఒకవైపు, కేసులు ఒకవైపు, పక్కరాష్ట్రంతో జల వివాదాలు మరోవైపు, అమరావతి మార్పు, ఏకపక్షమైన మీడియా ఒకవైపు, ఇలా అన్నీ ముప్పేట దాడితో ఆయన సతమతమవుతున్నారు. ఇవన్నీ చిటికెలో మాయమవాలంటే..అక్కడ కేంద్రంతో సఖ్యత అవసరం అనేకన్నా అత్యవసరమనే చెప్పాలి.
అందుకని భవిష్యత్తులో తప్పనిసరిగా బీజేపీతో ఆయన చెలిమి చేసే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా కలిస్తే మాత్రం అక్కడ కేసీఆర్ తోక కత్తిరించవచ్చు..ఇక చంద్రబాబు కథ సుఖాంతము కావచ్చు అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు భవిష్యత్ రాజకీయాల్లో బీజేపీ-జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి..పవన్ కల్యాణ్ తో కూడా ఇబ్బందులు రాకపోవచ్చు..అంటున్నారు. సమస్యల్లేని ఆంధ్రప్రదేశ్ గా అవతరిస్తుంది..అందరికీ న్యాయం జరుగుతుంది అని కూడా అంటున్నారు.