#GHMCElections : కరోనా ఎఫెక్టు..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేస్తుందా?

జంటనగరాల్లో ఎన్నికల నగారా..అన్నిపార్టీల సమాయాత్తం

GHMC Elections : హైదరాబాద్ లో జంటనగరాల ఎన్నికలకు నగారా మోగనుంది. అప్పుడే ఎన్నికల కమిషన్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. వచ్చే రెండునెలల్లో నోటిఫికేషన్ రానుంది. దీంతో రాజకీయ పార్టీల మధ్య వ్యూహ, ప్రతివ్యూహాలు, సర్దుబాట్లు, రాజీధోరణులు, బుజ్జగింపులు, వేధింపులు, పంతాలు, పట్టింపులు అన్నీ మొదలైపోయాయి. అప్పుడే రాజకీయ వేడి మొదలైందనే చెప్పాలి.

అందుకు ఉదాహరణే తాజాగా గోషామహల్ లో అధికార పార్టీ మధ్య జరిగిన కుమ్ములాటలు..ఇద్దరు మంత్రులు ఇలా వెళ్లగానే అలా పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రమంతా ఏకఛత్రాధిపత్యం ఉంటే ఉండవచ్చు కానీ జంటనగరాలకు వచ్చేసరికి ఆ పప్పులు ఉడకడం లేదు. కరోనా అంటే ఒకప్పుడు ప్రజలు భయపడేవారు.. ఇప్పుడా భయం పోయింది. అలాగే కేసీఆర్ అంటే ఒకప్పుడు భయం ఉండేది..ఇప్పుడది పోయింది..అందుకు ఆ గోషామహల్ గొడవే ఒక ఉదాహరణగా చెప్పాలి.

ప్రస్తుతం జంటనగరాల్లో టీఆర్ఎస్ కి.. బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పాలి. తర్వాత స్థానం కాంగ్రెస్..ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి. అయితే నాయకులు, డబ్బు, క్యాడర్..వీటన్నింటితో ఈ మూడు ప్రధాన పార్టీలు బలమైన పోటీదారులుగా ఉంటాయి. అంతేకాని టీఆర్ఎస్ కే అంతా పెత్తనమైతే ఉండదు. ప్రస్తుతం కరోనా కష్టాలు ఇంకా ముగియలేదు.

కేసీఆర్ మాటలగారడీ..మొదట కరోనాని అరికట్టడంలో మాఅంతటి మొనగాడు లేడని చెప్పి.,ఇప్పుడంతా వదిలేశారని ప్రజల్లో ఆగ్రహావేశాలు చాలా తీవ్రంగా ఉన్నాయి.మరి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కరోనా ఎఫెక్టు ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాల్సిందే. ప్రధాన పోటీదార్లు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎంతవరకు ప్రజల్లో తీసుకువెళ్లి..ఫలితం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

 

Leave A Reply

Your Email Id will not be published!