YS Jagan : నాడు నేడుతో దేశానికి ఆదర్శంగా నిలిచింది ఏపీ. ఇక నుంచి విద్యా రంగంలో దేశం మొత్తం మన వైపు చూసేలా కృషి చేయాలని అన్నారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఉన్నత విద్యపై సీఎం సమీక్షించారు.
చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పాలన్నారు. ప్రస్తుతం అందిస్తున్న కోర్సులతో పాటు కొలువులు సంపాదించేలా కోర్సులు రూపొందించాలని, ఆదిశగా ప్రయత్నం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు జగన్ రెడ్డి(YS Jagan).
ప్రధానంగా కమ్యూనికేషన్స్ స్కిల్స్ , ఇంగ్లీష్ భాషపై పట్టు లేకుండా పోతోందని దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని, పిల్లలకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
వీటిపై పట్టు సాధించేలా చూడాలన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఉన్నత స్థాయి పరీక్షలకు తయారయ్యేలా చూడాలన్నారు. జీఆర్ఈ, జీమ్యాట్, ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, బిట్స్ పిలానీ, నీట్ , తదితర వాటికి తర్ఫీదు ఇవ్వాలన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా విద్యార్థులు మరింత రాటు దేలాలన్నారు. ఇందు కోసమే విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఏపీ సీఎం. జీఆర్ఈ 80 శాతానికి పైగా ఉండాలన్నారు.
ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే వారు చదువు కోవాలన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అమ్మాయిలు చదువుకు దూరం అవుతున్నారని , వారిని కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకు రావాలని ఆదేశించారు జగన్ రెడ్డి.
ప్రత్యేకించి కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఫోకస్ పెట్టాలన్నారు.
Also Read : మూడురాజధానులకు ఆత్మగౌరవ టచింగ్