AP CM YS Jagan : వైఎస్సార్ లా నేస్తం అభ‌య హ‌స్తం

పిలుపునిచ్చిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

AP CM YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి చెందిన యువ న్యాయ‌వాదుల‌కు దిశా నిర్దేశం చేశారు. తొలి మూడేళ్లుగా అండ‌గా ఉన్నామ‌ని తెలిపారు. 2023-34 సంవ‌త్స‌రానికి గాను మొద‌టి విడ‌త వైస్సార్ లా నేస్తం కింద స్టైఫండ్ జ‌మ చేశామ‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి. 5 నెల‌ల కాలానికి ఒక్కో యువ న్యాయ‌వాదికి నెల‌కు రూ.5 వేల చొప్పున రూ. 25 వేల రూపాయ‌లు జ‌మ చేశారు. ఇందుకు సంబంధించి సోమ‌వారం త‌న క్యాంపు కార్యాల‌యంలో సీఎం బ‌ట‌న్ నొక్కి ప్రారంభించారు.

ఇందులో భాగంగా రూ. 6,13,65,000 ను వారి ఖాతాల్లో జ‌మ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది జూనియ‌ర్ న్యాయ‌వాదుల ఖాతాల్లో వీటిని జ‌మ చేశారు సీఎం. దేవుడి ద‌య‌తో ఇవాళ మంచి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan). గ‌త నాలుగు ఏళ్లుగా ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంద‌న్నారు.

న్యాయ‌వాదులు లా కోర్సు పూర్తి చేసిన త‌ర్వాత మొద‌టి మూడేళ్ల‌లో ప్రాక్టీస్ ప‌రంగా నిల‌దొక్కు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అప్పుడే చ‌దువు పూర్తి కావ‌డం, డ‌బ్బులకు ఇబ్బంది ప‌డ‌డం తాను చూశాన‌ని అన్నారు. వారికి తోడుగా ఉండాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. అందులో భాగంగానే తాను ప్ర‌తి నెలా రూ. 5 వేలు స్టైఫండ్ గా ఇస్తున్న‌ట్లు చెప్పారు ఏపీ సీఎం.

Also Read : Arvind Kejriwal : విద్యకు చేయూత భ‌విష్య‌త్తుకు భ‌రోసా

 

Leave A Reply

Your Email Id will not be published!