YS Jagan : మొన్న ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి రామానుజ సహస్రాబ్ది మహోత్సవాలలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్న ఏపీ సీఎం జగన్ రెడ్డి (YS Jagan )ఇవాళ విశాఖలోని శ్రీ శారదా పీఠానికి రానున్నారు.
శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ మూడో రోజు ఉత్సవాలలో ప్రత్యేక అతిథిగా జగన్ హాజరున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీ శారదా పీఠం వరకు ట్రయల్ రన్ కూడా చేపట్టారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీ శారదా పీఠానికి చేరుకుంటారు.
ఇందులో భాగంగా శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగే రాజ శ్యామల యాగంలో పాల్గొంటారు. సీఎం(YS Jagan )ప్రత్యేక పూజలు చేస్తారు.
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా శారదా పీఠాన్ని దర్శించుకుంటూ వస్తున్నారు. ఉత్సవాలలో పాల్గొంటూ వస్తున్నారు జగన్. కాగా జగన్ కు శారదా పీఠం పీఠాధిపతి ఆశీస్సులు ఎక్కువగా ఉన్నాయి.
ఆయన పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆలయాల పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు.
అదే సమయంలో జగన్ పవర్ లోకి రావడంతో స్వామి వారి హవా కూడా పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు జగన్ తాను హిందువులకు సైతం భక్తుడినని, అందరి వాడినని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : స్వామి సన్నిధికి అమిత్ షా