YS Jagan Delhi Tour : ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బిజీ

ప్ర‌ధాని మోదీని క‌లిసిన సీఎం

YS Jagan Delhi Tour : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీతో భేటీ అయ్యారు.

గంట‌కు పైగా స‌మావేశం జ‌రిగింది. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌ధానంగా తెలంగాణ నుంచి రావాల్సిన బ‌కాయిల‌ను, నిధుల‌ను వెంట‌నే మంజూరీ చేసేలా చూడాల‌ని కోరారు ఏపీ సీఎం. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రికి ప‌లు విన‌తిప‌త్రాలు కూడా స‌మర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రికి జ్ఞాపిక‌ను బ‌హూక‌రించారు.

ఇదిలా ఉండ‌గా నిన్న రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ కావాల్సి ఉండ‌గా అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. గురువారం తిరిగి టైం ఇవ్వ‌డంతో షాతో ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి(YS Jagan Delhi Tour) స‌మావేశం కానున్నారు.

తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించి ప‌లు అభివృద్ది ప‌నులు, కీల‌క అంశాలు చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇందులో ప్ర‌ధానంగా ఆంధ్ర ప్ర‌దేశ్ కు ఇప్ప‌టి వ‌ర‌కు నిధులు రావ‌డం లేద‌ని ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ని తెలిపారు. పెండింగ్ బ‌కాయిలు, పోల‌వరం స‌హా ప‌లు అంశాల‌పై ప్ర‌ధాన‌మంత్రి మోదీతో చ‌ర్చించిన‌ట్లు టాక్.

ఇప్ప‌టికే రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్ప‌గా మారింద‌ని పార్ల‌మెంట్ లో ప్ర‌క‌టించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. నెల నెలా రాష్ట్రాన్ని న‌డిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే ప‌రిస్థితిని తెలంగాణ రాష్ట్రం కూడా ఎదుర్కొంటోంది.

Also Read : క‌న్నీళ్లు మిగిల్చిన కందుకూరు స‌భ‌

Leave A Reply

Your Email Id will not be published!