AP CM YS Jagan : బస్సు ప్రమాదం జగన్ సంతాపం
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు
AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) వెంటనే స్పందించారు. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
AP CM YS Jagan Words
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు ఏపీ సీఎం. అంతే కాకుండా స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున సాయం చేయాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి సహాయ సిబ్బంది చేరుకున్నారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై విచారణకు ఆదేశించారు. ఇటీవల బస్సు ప్రమాదాలు చోటు చేసుకుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సీఎం జగన్ రెడ్డి. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలని , తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వెంటనే ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆదేశించారు జగన్ రెడ్డి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు ఏపీ సీఎం.
Also Read : Botsa Satyanarayana : పవన్ కు పాఠాలు అవసరం – బొత్స