AP CM YS Jagan Delhi Tour : 28న హ‌స్తిన‌కు సీఎం జ‌గ‌న్

పీఎం మోదీతో భేటీకి రెడీ

AP CM YS Jagan Delhi Tour : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ఢిల్లీకి(AP CM YS Jagan Delhi Tour) వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం బ‌య‌లు దేర‌నున్న‌ట్లు స‌మాచారం. 28న సీఎం పీఎం న‌రేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈనెల ఢిల్లీలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. సీఎం జ‌గ‌న్ తో పాటు టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. భార‌త్ కు ప్ర‌స్తుతం జీ20 గ్రూప్ కు సార‌థ్యం వ‌హించే అవ‌కాశం ద‌క్కింది.

ఇందుకు సంబంధించి ఏమేం చేయాల‌నే దానిపై ఆలోచ‌న‌లు పంచుకోవాల‌ని, సూచ‌న‌లు ఇవ్వాల‌ని కోరుతూ అన్ని పార్టీల‌ను , సీఎంల‌ను ఆహ్వానించారు మోదీ. ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి హాజ‌రయ్యారు. త‌న విజ‌న్ ను పంచుకున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు.

దీనిపై బీజేపీ నానా రాద్దాంతం చేసింది. దేశానికి సంబంధించిన ప్ర‌ధాన అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో సీఎం పాల్గొన‌క పోవ‌డం అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు బీజేపీ నేత‌లు. ఇదిలా ఉండ‌గా ఈ డిసెంబ‌ర్ నెల‌లోనే ఇది రెండో అధికారిక ప‌ర్య‌ట‌న కావ‌డం విశేషం.

ఆయ‌న క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. పూర్త‌య్యాక ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. మ‌రో వైపు పార్ల‌మెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారింద‌ని పేర్కొన్నారు.

దీనిని త‌గ్గించు కోక పోతే ప్ర‌మాదమ‌ని హెచ్చ‌రించారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ టూర్ లో భాగంగా కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వ‌నున్నార‌ని స‌మాచారం. ఏది ఏమైనా జ‌గ‌న్ రెడ్డి పీఎంను క‌ల‌వ‌డం రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Also Read : నా స్థాయికి ఆ ప‌ద‌వి స‌రిపోదు – కొండా

Leave A Reply

Your Email Id will not be published!