AP CM YS Jagan : మత్స్యకారులకు నష్ట పరిహారం
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
AP CM YS Jagan : అమరావతి – ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమీషన్ (ఓఎన్జీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పైపు లైన్ ద్వారా జీవనోపాధి కల్పోయిన మత్స్యకారులకు ఖుష్ కబర్ చెప్పారు. ఈమేరకు మంగళవారం తాడేపల్లిగూడెం లోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో నేరుగా బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు.
AP CM YS Jagan Announced Financial Support to Fishermen
ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో , అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం జమ చేశారు జగన్ రెడ్డి. కాకినాడ జిల్లాలో మరో 7,050 మంది మత్స్యకారులకు కూడా సాయం అందజేశారు సీఎం.
ఇదిలా ఉండగా మొత్తం ఇప్పటి వరకు 23 వేల 458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). తమ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
ఎవరు ఏ రకంగా నష్ట పోయినా సరే ప్రభుత్వం ఆదుకుంటుందని కుండ బద్దలు కొట్టారు ఏపీ సీఎం.
Also Read : Chiranjeevi : మన్సూర్ కామెంట్స్ చిరంజీవి సీరియస్