AP CM YS Jagan : 357 మంది విద్యార్థుల‌కు రూ. 45.53 కోట్లు

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

AP CM YS Jagan : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పేద విద్యార్థులు సైత ప్ర‌పంచ వ్యాప్తంగా యూనివ‌ర్శిటీల‌లో చ‌దువుకునేందుకు సీఎం జ‌గ‌న్ రెడ్డి ఇప్ప‌టికే విదేశీ విద్యా దీవెన ప‌థ‌కాన్ని తీసుకు వ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 357 మందికి రూ. 1.25 కోట్ల వ‌ర‌కు, ఇత‌ర విద్యార్థుల‌కు రూ. 1 కోటి వ‌ర‌కు 100 శాతం ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ఇచ్చారు సీఎం.

AP CM YS Jagan Says

విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన 357 మంది విద్యార్థుల‌కు క్యాంపు కార్యాల‌యంలో గురువారం బ‌ట‌న్ నొక్కి ల‌బ్దిదారుల ఖాతాలో రూ. 45.53 కోట్లు జ‌మ చేశారు జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan). ఇది పేద విద్యార్థుల‌కు మేలు క‌లిగించేందుకు ఏర్పాటు చేశామ‌న్నారు. ఆర్థిక స్థోమ‌త లేని వాళ్ల‌కు ఎంతో ఉప‌యోగ ప‌డుతోంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

ఈ ప‌థ‌కాన్ని అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ ర్యాంకింగ్స్ లో ప్ర‌పంచంలోని టాప్ -50 విద్యా సంస్థ‌ల్లో సీటు వ‌చ్చిన ఏ విద్యార్థి అయినా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం తెలిపారు. విమాన ఛార్జీలు, వీసా ఛార్జీలు మొత్తం ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. ఈ బృహ‌త్త‌ర ప‌థ‌కం దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు సీఎం.

గ‌తంలో ప్ర‌భుత్వం విద్యార్థుల‌ను ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డి. అర్హులైన వారిని ప‌క్క‌న పెట్టార‌ని కానీ తాము వ‌చ్చాక పూర్తిగా స‌హాయం అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : Mohd Siraj Released : చేతికి గాయం సిరాజ్ వ‌న్డేల‌కు దూరం

 

Leave A Reply

Your Email Id will not be published!