YS Jagan : పంతుళ్ల‌కు సీఎం జ‌గ‌న్ శుభ‌వార్త

10 వేల మందికి పైగా ప‌దోన్న‌తి

YS Jagan : ఏపీ ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. రాష్ట్రంలో ప‌ని చేస్తున్న పంతుళ్లకు ప‌దోన్న‌తి క‌ల్పించేందుకు సీఎం జ‌గ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీని వ‌ల్ల 10 వేల మందికి పైగా టీచ‌ర్ల‌కు ల‌బ్ది చేకూర‌నుంది.

స‌ర్వీస్ నిబంధ‌న‌ల మేర‌కు ఆయా పంతుళ్లు డిప్యూటీ డిఇఓ, ఎంఈవో, హెడ్మాస్ట‌ర్లుగా ప‌దోన్న‌తులు ద‌క్క‌నున్నాయి. ఈ మేర‌కు ప్ర‌మోష‌న్స్ కోసం అద‌నంగా 666 మండ‌ల విద్యాశాఖ అధికారి, 36 డిప్యూటీ డిఈఓ పోస్టుల‌ను క్రియేట్ చేసింది విద్యా శాఖ‌.

దీని వ‌ల్ల 2,300 మందికి పైగా టీచ‌ర్ల‌కు ఆయా సబ్జెక్టుల‌లో మార్పులు చోటు చేసుకునే చాన్స్ ఉంది. రాష్ట్రంలో గ‌త 22 ఏళ్లుగా ప‌రిష్కారానికి నోచుకోని అప‌రిష్కృత స‌మ‌స్య‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan) ప‌రిష్కారం చూపారు.

వ‌చ్చే నెల సెప్టెంబ‌ర్ లో ప్ర‌మోష‌న్స్ ఇచ్చేందుకు ప‌చ్చ జెండా ఊపారు. ఆ త‌ర్వాత ఆయా ప్రాంతాల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్ల‌కు ట్రాన్స్ ఫ‌ర్స్ ఉంటాయి.

ఇక పంతుళ్ల‌కు స్కూల్ అసిస్టెంట్స్ గా, హెచ్ ఎంలుగా, ఎంఈఓలుగా , జిల్లా ఉప విద్యా శాఖ అధికారులుగా ప్ర‌మోష‌న్స్ ల‌భించ‌నున్నాయి.

ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు దీనికి సంబంధించిన ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేసేందుకు గాను ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది.

దీని వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండ‌వు. దీని వ‌ల్ల 7 వేల మంది ఎస్జీటీల‌కు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్ర‌మోష‌న్స్ ద‌క్కనున్నాయి.

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ కొలువు తీరాక విద్యాభివృద్ధి కోసం ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. నాడు నేడు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. స్కూళ్ల‌ను ప్రైవేట్ విద్యా సంస్థ‌ల‌కంటే ధీటుగా చేశారు.

Also Read : దోపిడీ దొంగ‌ల ప‌ట్ల జ‌ర జాగ్ర‌త్త – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!