AP CM YS Jagan : రైతుల సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

రూ. 120 .75 కోట్లు జ‌మ

AP CM YS Jagan : ఏపీ రాష్ట్రంలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన కౌలు రైతులు , దేవాదాయ భూముల సాగుదారుల‌కు తొలి విడ‌త‌గా వైఎస్సార్ రైతు భ‌రోసా కింద రూ.109.01 కోట్లు , పంట న‌ష్ట పోయిన 11, 373 మంది రైతుల‌కు ఇన్ పుట్ సబ్సిడీగా రూ. 11.01 కోట్ల‌తో క‌లిపి మొత్తం రూ. 120.75 కోట్ల ఆర్థిక సాయాన్ని క్యాంపు ఆఫీసులో బ‌ట‌న్ నొక్కి జ‌మ చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి.

AP CM YS Jagan Released Rythu Barosa

దేవుడి ద‌య‌తో ఇవాళ రెండు మంచి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింద‌న్నారు సీఎం. ఇందులో కౌలు రైతులతో పాటు దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న కౌలు రైతుల‌కు కూడా మేలు చేకూర్చ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan). రైతు భ‌రోసా కింద 2023-24కు సంబంధించి పెట్టుబ‌డి సాయం అంద‌జేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

గ్రామ స‌చివాల‌యాల్లోనే సీసీఆర్సీ కార్డుల‌ను అందుబాటు లోకి తీసుకు వ‌చ్చామ‌ని తెలిపారు సీఎం. కౌలు రైతుల‌కు, భూమి య‌జ‌మానుల‌కు మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందాలు కుద‌ర్చ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దీని వ‌ల్ల ఎలాంటి న‌ష్టం అంటూ వాటిల్ల‌ద‌ని పేర్కొన్నారు. 50 నెల‌ల్లో దాదాపు 5.28 ల‌క్ష‌ల మంది కౌలు రైతుల‌కు , 3.99 ల‌క్ష‌ల అట‌వీ భూములు సాగు చేసే గిరిజ‌నులు మొత్తం 9.22 ల‌క్ష‌ల మందికి రూ. 1,122 కోట్లు పెట్టుబ‌డి సాయం చేశామ‌న్నారు.

4 సంవ‌త్స‌రాల కాలంలో 52.50 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 31 వేల కోట్ల రైతు భ‌రోసా జ‌మ చేసిన‌ట్లు చెప్పారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రైతు భ‌రోసా స్కీం వ‌ల్ల రాష్ట్రంలో సాగు మ‌రింత పెరిగింద‌న్నారు. ఇది ఆదాయం పెరిగేలా చేస్తుంద‌న్నారు.

Also Read : India Alliance : ఇండియా కూట‌మి స‌మ‌న్వ‌య క‌మిటీ

Leave A Reply

Your Email Id will not be published!